TG | ఆ ఇద్దరి పై కేసు..

TG | ఆ ఇద్దరి పై కేసు..
- డబ్బు పంచుతున్న ఇద్దరిపై కేసు..
- 30 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం..
- నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు..
TG, నేరడిగొండ, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న మహిళకు అనుకూలంగా డబ్బు పంచుతున్న ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని ఎస్సై ఇమ్రాన్ తెలియజేశారు. ఇద్దరు షేక్ కైఫ్ పాషా, షేక్ జాకిఉల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసామన్నారు. ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం, బహుమతులు పంచేవారి సమాచారం డైల్ హండ్రెడ్ ద్వారా తెలియజేయాలని తెలిపారు.
