POLICE | అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..!!

POLICE | అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..!!

  • రూ.125800 లు నగదు, వస్తువులు స్వాధీనం..!!
  • ఈ ముఠాపై ఏడు రాష్ట్రాల్లో 31 కేసులు…!!

POLICE | పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఇవాళ‌ పోలీసులు చిలకలూరిపేట పట్టణంలో అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు ఆదేశాల మేరకు, డి.ఎస్.పి మేదరమెట్ల హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట పట్టణ పోలీసులు (Police) ఈ కేసులో ఐదుగురు దొంగలు ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు పోలీసులు వెల్లడించారు. పట్టణంలో నివాసముంటున్న బైరా సుజాత ఇంట్లో దొంగలు పడి, బంగారం, వెండి, నగదు, ఇతరు వస్తువులను దొంగిలించారు.

నవంబర్ 28వ తేదీన సుజాత ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడి వస్తువులను, నగదును దొంగిలించుకుపోయారు. అరెస్టు (Arrest) అయిన‌ అంతర్ రాష్ట్ర దొంగ ముఠాలో ఉత్తరాఖండ్ కు చెందిన నూర్ హసన్, అబ్దుల్ గఫార్, హర్యానాకు చెందిన నో సద్, మిన్నా యామిన్, ఉత్తర ప్రదేశ్ చెందిన సాహుల్ ఉన్నారు. వీరి వద్ద నుండి రూ.1,25,800లతో పాటు దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. దొంగలు అపహరించిన సొమ్ము సుమారు రూ.5,55,000లు ఉంటుందని తెలియజేశారు. వీరిపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 31 కేసులు నమోదు కాబడ్డాయని వెల్లడించారు.

POLICE

ఈ కేసును చేధించిన వారిలో చిలకలూరిపేట పట్టణ సిఐ పి.రమేష్ (CI P.Ramesh), ఎస్ఐ పి.హజరత్తయ్య, హెచ్ సి వై.శ్రీనివాస్, పిసిలు ఎస్.వేణు కుమార్, వి.నారాయణరావు, వి.హరీష్, కె.శ్రీరాములు, జి.జాన్ బాసు, కె. శివకృష్ణ, షేక్. జాన్ బాష లు ఉన్నారు. వీరిని జిల్లా పోలీసులు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కాగా దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను ఈ దొంగల ముఠా పలాసలో విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply