IDPL lands | రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

IDPL lands | రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

  • ఐడీపీఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

IDPL lands | హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని ఐడీపీఎల్‌ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కూకట్‌పల్లి (Kukatpally) సర్వే నంబర్‌ 376లో ఉన్న సుమారు రూ.4 వేల కోట్ల విలువైన భూములపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్‌ అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే (MLA) మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ వివాదం సంచలనంగా మారిన నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Leave a Reply