Gazette notification | 6 జోన్లు.. 2 మల్టీ జోన్లు..

Gazette notification | ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : 26 జిల్లాల ఆధారంగా కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌-1975 ప్రకారం ఉన్న జోనల్‌ నిబంధనలను కేంద్రం సవరించింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్‌, జోనల్‌, మల్టీ జోన్ల పై స్పష్టతనిస్తూ గెజిట్‌ విడుదల అయింది. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకుంటారు. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మల్టీ జోన్‌-1 :
జోన్‌-1 : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు.
జోన్‌-2 : అల్లూరి సీతారామరాజు, తూ.గో., కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు.
జోన్‌-3 : ప.గో., ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు.

మల్టీ జోన్‌-2 :
జోన్‌-4 : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు..
జోన్‌-5 : తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు..
జోన్‌-6 : నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు.

Leave a Reply