ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా మార్చే లక్ష్యంతో ఆ ఫ్రాంచైజీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సిబ్బందిని మార్చింది. జట్టు ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీ నియమితులయ్యారు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కోచ్‌లను మార్చారు.
ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. డీసీ మెంటర్‌గా నియమించింది. ఈ మేరకు డీసీ సామాజిక మాధ్యమాల్లో కీలక ప్రకటన చేసింది.
పీటర్సన్ ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ 2009, 2010, 2012, 2014, 2016 సీజన్లలో ఐపీఎల్‌లో ఆడాడు. పీటర్సన్ 2012 నుంచి 2014 వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుకు మెంటార్ రూపంలో సేవలు అందించనున్నాడు.