Leaders | ఆదరించి మరోసారి గెలిపించండి….

Leaders | ఆదరించి మరోసారి గెలిపించండి….

Leaders | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని దాదన్ పల్లి గ్రామ అభివృద్ధికి తనను ఆదరించి మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జి. ప్రతాప్ రెడ్డిని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఈ రోజు దాదన్ పల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గతంలో చేపట్టిన అభివృద్ధి(Development)ని వివరిస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.

గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుందని అన్నారు .కేంద్రం నిధులు ఇస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకనే బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) గ్రామపంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదని గుర్తు చేశారు.

గత రెండేళ్లుగా గ్రామాలలో అభివృద్ధి కుంటుబడి పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదన్ పల్లి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఈ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న తనను మరోసారి సర్పంచ్ గా గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని దాదనపల్లి గ్రామ ప్రజలను కోరారు .ఈ కార్యక్రమంలో నాయకులు(Leaders) బి .వెంకటన్న, లింగప్ప, గంగప్ప, కురువ భీమన్న, గోకరి భీమన్న, మీదిగేరి హనుమంతు ,బళ్లారి హనుమంతు, గుగ్గుళ్ల ఆంజనేయులు, బొంపల్లి అశోక్, భీమ్లమ్మ,శంకరమ్మ, జయమ్మ ,లక్ష్మి, అంజమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply