Motkur | అవకాశం ఇవ్వండి…

Motkur | అవకాశం ఇవ్వండి…

  • గ్రామ అభివృద్ధి చేస్తా…
  • పాటిమట్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గిరగాని ఉమ శ్రీనివాస్

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే .. పాటిమట్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గిరగాని ఉమ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ‌ గ్రామంలో సుమారు 300మంది యువకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా అభ్యర్థి ఉమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ పదవులు చేయలేదని.. తాము గ్రామ సేవ కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చామని, గ్రామాభివృద్ధి తమ లక్ష్యమని, తమ ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో పాటిమట్ల సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.

Leave a Reply