Death anniversary | స్ఫూర్తిదాయకుడు అమరజీవి

Death anniversary | స్ఫూర్తిదాయకుడు అమరజీవి

  • ఆయ‌న త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
  • జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
  • ఘనంగా పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి

Death anniversary | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయ‌న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనలో ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర‌ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన మహానీయుడని కొనియాడారు.

పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకుడు. ఆయన జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లా పేరును “పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా” అని మార్చారు.అలాంటి గొప్ప త్యాగధనుడిని స్మరించుకుంటూ, మనం తెలుగు భాషను, సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్.యుగంధర్ బాబు, రిజర్వు ఇన్స్పెక్టర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply