Election | భారీ బందోబస్తు మధ్య..

Election | భారీ బందోబస్తు మధ్య..

  • ఉపసర్పంచ్ ఎన్నిక

Election | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రాన్ పల్లి మండలంలోని నిన్న జరిగిన ప్రాథమిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జక్రాన్ పల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, బండి పద్మ కైవసం చేసుకోగా, ఉప సర్పంచ్ ఎన్నిక నిన్న జరగవలసి ఉండగా, ప్రత్యర్ధుల మధ్య గొడవ జరగడంతో నిన్న వాయిదా వేసి ఇవాళ భారీ పోలీస్ బందోబస్తు మధ్య 163 సెక్షన్ నిబంధనలు అమలు చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తున్నారు.

జక్రాన్ పల్లి గ్రామ పంచాయతీ మొత్తం 14మంది వార్డ్ మెంబర్స్ ఉండగా, అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వార్డు మెంబర్ల బలముండగా, బీఆర్ఎస్ పార్టీకి 8మంది వార్డ్ మెంబర్స్ బలం ఉంది. కాగా మరికొద్ది గంటల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ఫలితాలు తేలాల్సి ఉంది.

Leave a Reply