Makthal | సంగంబండ అభివృద్ధి కోసం గెలిపించండి

Makthal | సంగంబండ అభివృద్ధి కోసం గెలిపించండి
- సేవకుడిగా ప్రజల కోసం పని చేస్తా
- బీజేపీ బలపరిచిన సంగంబండ సర్పంచ్ అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : సంగంబండ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని బీజేపీ మద్దతుతో సర్పంచ్ గా బరిలో నిలిచిన సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన తన మద్దతుదారులతో గ్రామంలోని వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింట ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తాను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టే పనులను వివరించారు. సంగంబండ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని గ్రామంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలు పక్కనపెట్టి గ్రామాభివృద్ధి కోసం తనను సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పంచాయతీలు అభివృద్ధి సాధ్యమన్నారు.
ఎంపీ డీకే అరుణమ్మ సహకారంతో పెద్ద ఎత్తున కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు వివరించారు. సర్పంచ్ గా ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాల్సిందిగా గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి, గవినోళ్ళ బలరాం రెడ్డి, నరసింహ రెడ్డి, చిన్నారెడ్డి, స్వప్న, నరసింహ, కృష్ణారెడ్డి, ఎం.నాగిరెడ్డి, వై.పల్లవి, తదితరులు పాల్గొన్నారు.
