Mothkur | పాలడుగులో పోరు రసవత్తరం…

Mothkur | పాలడుగులో పోరు రసవత్తరం…

  • పోటీలో ఆరుగురు… ప్రచారంలో నలుగురే..!
  • కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి బిఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు
  • కాంగ్రెస్ వర్సెస్ ఇండిపెండెంట్
  • బీసీ కార్డ్ …ఫలించేనా..?

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మండలంలోని పాలడుగు గ్రామపంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచ్ పదవి కోసం ఏకంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎన్నికల అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. యాస నర్సిరెడ్డి(లేడి పర్సు) ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సామెల్ ప్రకటించడంతో .. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అంతటి భగవంతు(ఉంగరం) ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మరిపెళ్లి శేఖర్(ఫుట్ బాల్), మాజీ ఎమ్మెల్యే కిశోర్ ఆదేశాల మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థి భగవంతుకి మద్దతు తెలిపారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థిని శివరాత్రి ప్రేమలత (టీవీ రిమోట్) సైతం తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం నిర్వహించకుండా, బీసీ కార్డు నినాదంతో బీసీ అభ్యర్థిగా ఉన్న అంతటి భగవంతుకి తమ మద్దతు ప్రకటించడంతో పాటు భగవంతుకు మద్దతుగా ఇరువురు సర్పంచ్ అభ్యర్థులు ఏకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్ధి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో… అధిక మొత్తంలో ఉన్న స్థానిక ఎస్సీ, బీసీలు ఏకమై బీసీ అభ్యర్థి భగవంతుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. బీజేపీ తరపున గుదే మధుసూదన్ యాదవ్(కత్తెర), బీఎస్పీ తరపున నిమ్మల సురేష్ (బ్యాట్)లు సైతం పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నర్సిరెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి భగవంతు మధ్యనే పోటీ ఉండనున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ కార్డ్ ఫలిస్తుందో.. లేదో..? వేచి చూడాల్సిందే.

Leave a Reply