Christmas | ఐక్య గ్రాండ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్..

Christmas | ఐక్య గ్రాండ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్..

Christmas, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలో ఆదివారం రాత్రి వీరపనేని సరోజినీ పార్కులో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఘంటసాల మండల పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ మండల దైవ సేవకుల సహకారంతో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేశారు. ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్వాహకులతో కలిసి వెంకట్రామ్ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఏసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల ప్రేమ, ఆత్మీయత కనబరిస్తే సమాజంలో శాంతి, సౌఖ్యం విరజిల్లుతాయన్నారు. ఈ సందర్భంగా ఏలూరు నుంచి వచ్చిన బిషప్ డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్, సర్పంచ్ బాణావత్తు వెంకటేశ్వరమ్మ, పేర్ల శ్రీనివాసరావు (పీఎస్ రావు), మాదివాడ వెంకటకృష్ణ (క్రిస్టియన్), మండల పాస్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply