ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది..

  • తిర్యాణి సర్పంచ్ అభ్యర్థి నైతం రామచందర్

తిర్యాణి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ పరిధిలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తిర్యాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నైతం రామచందర్ అన్నారు. తమ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా తాను సర్పంచ్‌గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. తాను రిటైర్డ్ ఉపాధ్యాయుడినని, మొదటి నుంచి సేవాభావంతోనే పనిచేస్తూ వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తనకు వచ్చే పెన్షన్ జీవనోపాధికి సరిపోతుందని, సర్పంచ్ వేతనాన్ని పంచాయతీ అభివృద్ధికే కేటాయిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఇచ్చిన భరోసాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బొల్లం మల్లేష్, అంకం గౌరయ్య, బొల్లం రాజు, మేరా చందు, కోన సురేష్, బొల్లం రాకేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply