Kadiri Hills | స్వాతి నక్షత్రం నేప‌థ్యంలో…

Kadiri Hills | స్వాతి నక్షత్రం నేప‌థ్యంలో…

  • స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు భక్తులకు స్వాగతం

Kadiri Hills | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ నరసింహ స్వామివారు ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న కుమ్మరవాండ్లపల్లి గ్రామ పరిధిలోని కదిరి కొండ (స్తోత్రాద్రి)కు విశేషమైన పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. శ్రీవారు తొలిసారిగా ఈ కొండపై పాదం మోపిన కారణంగానే ఈ క్షేత్రానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. ఇలాంటి అపూర్వ ప్రాముఖ్యత కలిగిన కదిరి కొండకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ నెల 16వ తేదీ మంగళవారం శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు ఉదయం 6గంటలకు శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం వద్ద చేరుకొని పాదయాత్రగా బయలుదేరనున్నారు. అనంతరం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నరసింహుడుగా, కాటమరాయుడుగా వెలసిన స్తోత్రాద్రిలో ప్రత్యేక హారతి నిర్వహించనున్నారు. తదుపరి గోవింద నామస్మరణతో శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply