Elections | భూపాలిపల్లిలో 84.14 శాతం పోలింగ్

Elections | భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 84.14 పోలింగ్ శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, పలిమెల మండలాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందన్నారు. నాలుగు మండలాల్లో 82,728 మంది ఓటర్లు ఉండగా, 69,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. భూపాలపల్లి మండలంలో 82.64 శాతం, చిట్యాలలో 83.86 శాతం, పలిమెలలో 86.04 శాతం, టేకుమట్ల లో 86.16 శాతం పోలింగ్ నమోదు జరిగినట్లు కలెక్టర్ తెలిపారు.
