SP Sangram Singh | పోలింగ్ కేంద్రాల పరిశీలన

SP Sangram Singh | పోలింగ్ కేంద్రాల పరిశీలన
SP Sangram Singh | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్‌లను (polling station) జిల్లా ఎస్పీ సంగ్రామ సింగ్ పరిశీలించారు. ఈ రోజు పాలెం, ఖానాపూర్, పెద్దకొత్తపల్లి, పెద్దముదునూరు, సాతాపూర్, చంద్రకల్, కల్వకోల్ గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షణ చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
