Polling Officers | పోలింగ్ సరళి పరిశీలన

Polling Officers | పోలింగ్ సరళి పరిశీలన
ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
Polling Officers | జగిత్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి: జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంతంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీఓ రఘు వరణ్, ఎంపీడీఓ, అధికారులు తదితరులున్నారు.
