Warangal | ఓటేసిన మార్నేని దంపతులు

Warangal | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని. రవీందర్ రావు, ఆయన సతీమణి మాజీ ఎంపీపీ మారినేని మధుమతీ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆదివారం మార్నేని దంపతులు ఓట్లు వేశారు.
