Fire Hazard | అద్దేపల్లి కాంప్లెక్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే..
Fire Hazard | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల నష్టం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం (Sunday) తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన అద్దేపల్లి కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అగ్నికి అహుతయిన కాంప్లెక్స్ లోని దుకాణాలను చూసిన ఎమ్మెల్యే, అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం చెప్పారు.

ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. వారికి ప్రభుత్వపరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తానని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గుడివాడలో (Gudivada) ఇటీవల తరచు అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరం అన్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే రాము అభినందించారు. జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఇమేజ్ రవి, టీడీపీ నాయకులు, చేకూరు జగన్మోహన్రావు, టీం వేనిగండ్ల సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.


