- ట్రాక్టర్ ప్రమాదంలో తొమ్మిది మంది
- ఏపీ భక్తులకు తీవ్ర గాయాలు
- ఇద్దరి పరిస్థితి విషమం
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: శబరిమలలో అదుపుతప్పి ట్రాక్టర్ భక్తుల మీదకి దూసుకెల్లింది. ఈ ఘనలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొమ్మిది మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. అయ్యప్పను దర్శనం చేసుకుని కొండ దిగే సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ వ్యర్థాలను తరలిస్తోందని సమాచారం. భారీ వర్షం కారణంగా, ఏటవాలు రహదారిపై వాహనం అదుపు తప్పిందని ,ట్రాక్టర్ డ్రైవర్ను సన్నిధానం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులు అందించిన వివరాల ప్రకారం, ట్రాక్టర్లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని,తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రి నుండి ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. గాయపడిన వారందరినీ పంబలోని ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

