Indrakeeladri | జై భవానీ..జైజై భవానీ

Indrakeeladri | జై భవానీ..జైజై భవానీ
- మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
- అరుణ ప్రవాహం
- దుర్గ గుడి సువర్ణ శోభితం
- మిరుమిట్లు గొల్పే దీపాలంకరణ..
- విరమణ ఉత్సవం ఆరంభం
Indrakeeladri | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : వేల సంఖ్యలో తరలివస్తున్న భవానీ దీక్ష పరులతో అమ్మవారి ఆలయం అరుణ శోభితంగా సాక్షాత్కరిస్తుంది. దీక్ష విరమణ కోసం అమ్మవారి ఆలయంతో పాటు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబు(Beautifully decorated throughout) కావడం, క్షణక్షణం అమ్మవారి నామస్మరణ మారుమృగతుండటం సప్తవర్ణ సువర్ణ శోభిత అలంకరణ విరమిడ్లు గొల్పే విద్యుత్ దీపాలంకరణలో ఇంద్రకీలాద్రి మెరుస్తోంది.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న భవాని దీక్ష విరమణ(Bhavani’s initiation ceremony) మహోత్సవం మూడో రోజుకు చేరుకుంది. గడిచిన మూడు రోజుల్లో సుమారు రెండున్నర లక్షలకు పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని పరమ పవిత్రంగా ఇరుముడిని సమర్పించుకున్నారు. భవానీల రాక క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయగా, లోటుపాట్లకు తాబే ఇవ్వకుండా అనుక్షణం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో దుర్గగుడి ఈవో, చైర్మన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Indrakeeladri | పోటెత్తుతున్న భవానీలు
దీక్ష విరమణ కోసం రాష్ట్రం నలుమూలలతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రి కి పోటెత్తుతున్నారు. మండల అర్థ మండల దీక్ష తీసుకున్న భవానీళ్లు నియమనిష్ఠలతో దీక్షను ఆచరించి, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, ఇరుముడిలను సమర్పిస్తున్నారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా కొండమీదకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కొండ దిగువున్న మహా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీక్ష విరమణ ప్రాంతంలో గురుభవానిలతో దీక్షను విరమింపు చేసుకుని ఇరుముడిలను సమర్పించుకుని పవిత్ర హోమగుండాలలో నీతి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు.

అక్కడే ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భవానీలు తమకు కావాల్సినంత లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. గురువారం నుండి ప్రారంభమైన దీక్ష విరమణకు సంబంధించి శనివారం రాత్రి సమయానికి సుమారు రెండున్నర లక్షలకు పైగా భవానీలు దర్శించుకున్నట్లు ఒక అంచనా. శుక్రవారం 96 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోగా శనివారం లక్షకు పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. లడ్డులు కూడా కొనుగోలు చేస్తుండడంతో లక్షల సంఖ్యలో లడ్డు విక్రయాలు జరుగుతుండడం, తలనీలాలతో పాటు వివిధ మార్గాలలో అమ్మవారికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

Indrakeeladri | క్షేత్రస్థాయిలోనే ఈవో చైర్మన్ ట్రస్ట్ సభ్యులు..
దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీల కోసం విస్తృత ఏర్పాటు చేయగా భవానిలకు అందుతున్న మౌలిక సదుపాయాలు లోటుపాట్లను క్షేత్రస్థాయిలోనే ఉండి ఈవో శీనా నాయక్ దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ నగర్ క్యూ లైన్లతో పాటు గిరిప్రదక్షిణ జరుగుతున్న ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తున్న వీరు కేశఖండనశాల పుణ్యస్నానాలు ఆచరిస్తున్న గాట్ వంటి ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. భవానీలకు అందుబాటులో మెడికల్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసిన అధికారులు, అవసరమైనన్ని మంచినీటి బాటిళ్లు బిస్కెట్ ప్యాకెట్లు పాలు అందుబాటులో ఉంచారు. ఆదివారం సెలవు దినం కావడం తో భవానీలో రాక మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా అధికారులు విస్తృతం చేశారు.

