Sandhya | నిస్వార్థంగా అభివృద్ధికి కృషి చేస్తా
- అనుగొండ సర్పంచ్ అభ్యర్థి సంధ్య ఆంజనేయులు
Sandhya | మక్తల్, ఆంధ్రప్రభ : మహిళగా ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే అనుగొండ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి సంధ్య ఆంజనేయులు అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని అనుగొండ గ్రామంలో మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారానికి చేపట్టారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామ అభివృద్ధికి నోచుకోలేదని, మహిళగా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పునరావాసం పనులు పూర్తి చేయించి అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోయి గోస పడవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న తనను ఆదరించి గెలిపించవలసిందిగా సర్పంచ్ అభ్యర్థి సంధ్య ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు.

