Candidate | మంత్రి సహకారంతో ఆదర్శ గ్రామంగా..
- మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్
Candidate | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో మంథన్ గోడ్ గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా మందన్ గోడ్ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న రాజేందర్ గౌడ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించండి గ్రామ అభివృద్ధి తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ లో ఇవాళ గ్రామంలో తన మద్దతు దారులతో ఇంటింటి ప్రచారం చేపట్టగా, ఆయన సతీమణి గౌడ్ మహిళలతో కలిసి గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తన భర్తకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తారన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధిస్తామన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సరిత, రాధ, అర్చన, సోనీ, గుడిగండ్ల అంజమ్మ, కృష్ణయ్య గౌడ్, గోపాల్ గౌడ్, వెంకటయ్య, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.

