Satish | బీజేపీతోనే సమగ్రాభివృద్ధి

Satish | బీజేపీతోనే సమగ్రాభివృద్ధి

యువకుడిగా అవకాశం కల్పిస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా
బీజేపీ సర్పంచి అభ్యర్థి సోలెం సతీష్

Satish | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల గ్రామ పంచాయతీ బీజేపీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి సోలం సతీష్ ఫుట్బాల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలు గ్రామాల ఓటర్లను అభ్యర్థించారు. గుండాల పంచాయతీ పరిధి గ్రామాలైన జగ్గయ్యగూడెం, కన్నాయిగూడెం, జామరతోగు, మటన్లంక, లక్ష్మీపురం, పోతిరెడ్డిగూడెం, గలభ, పలు గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే కేంద్రంలో బీజేపీ పార్టీ సహాయ సహకారాలతోనే సాధ్యమని, బీజేపీ సర్పంచి అభ్యర్థిపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అదే స్ఫూర్తితో బీజేపీ సర్పంచి అభ్యర్థి సతీష్ మ్యానిఫెస్టో ప్రకటించారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఎవరైనా అత్యవసర అనారోగ్య సమస్యతో సుదూర ప్రాంతం ఖమ్మం, ములుగు, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు పలు పట్టణాలకు వెళ్లేందుకు ఉచిత వాహన సదుపాయం కల్పిస్తామని, గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని వర్గాల ఆడపడచుల‌ పెళ్ళిల్లకు రూ.5016 రూపాయలను అందించడం జరుగుతుందని, గ్రామ పంచాయితీ పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి, పంచాయితీ పరిధిలో ఎవరైనా పేదవారు అకాల మరణం చెందితే ఆర్ధిక సహాయం కింద రు.10,016 ఇస్తామని, పంచాయితీ పరిధిలో బస్టాండ్, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

పంచాయితీ పరిధిలో సీసీరోడ్లు, డ్రైనేజి వ్యవస్థను సమర్థవంతంగా చేస్తానని, ఇచ్చిన 6 గ్యారెంటీలను రెండేళ్లలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నిబద్ధతతో ఉన్నానని, ఆశతో రాలేదు.. ప్రజా సమస్యల పట్ల అభివృద్ధి లక్ష్యంగా ఆశయంతో మీ ముందుకు రావడం జరిగిందన్నారు. మీ అమూల్యమైన ఓటు బాల్ గుర్తు పై వేసి బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో రుచిచూపిస్తానని సోలం సతీష్ పేర్కొన్నారు.

Leave a Reply