Chandur | కత్తెరదే గెలుపు..

Chandur | కత్తెరదే గెలుపు..
Chandur | చందూర్, ఆంధ్రప్రభ : చందూర్ మండలంలో కత్తెర గుర్తు అభ్యర్థులే సర్పంచ్ గా గెలుపొందారు. ప్రత్యర్థులను కత్తిరించుకుంటూ వెళ్లి విజయాన్ని సాధించారు. చందూర్ మండలంలో 5 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 3 గ్రామ పంచాయతీలలో కత్తెరగుర్తు అభ్యర్థులు చందూర్ లో మద్దూరి మాధవరెడ్డి 447 ఓట్ల మెజార్టీ, గన్పూర్ లో ముత్తకుంట కృష్ణ 85 ఓట్ల మెజారిటీతో, మేడిపల్లిలో బానోత్ శ్రావణి 7 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

