ఒకసారి సర్పంచ్‌గా అవకాశం ఇవ్వండి..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సామాన్య కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డను, సర్పంచ్ గా అవకాశం ఇచ్చి ఆశీర్వదించండని బజ్జు తండా సర్పంచ్ అభ్యర్థిగా నిలుచున్న గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు.

బ్యాట్ గుర్తుకు ఓటేసి గ్రామ సర్పంచిగా గెలిపిస్తే, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ జాటోత్ జీవుల తోపాటు పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రవి చిన్న మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, అలాగే అన్ని వీధుల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని, గ్రామంలోని ప్రతి ఒక్క‌రికి వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, గ్రామంలోని అన్ని వార్డులలో ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహిస్తానని, రోడ్లు చెత్త లేకుండా చూసుకోవాలని, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానీటేషన్ పనులు చేయించడంతోపాటు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తానని… సంవత్సరానికి ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తానని గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు,గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుపై ఓటు వేసి,భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply