Aadyam Handwoven | చేనేతకు కొత్త చైతన్యం..

Aadyam Handwoven | చేనేతకు కొత్త చైతన్యం..

  • ఆదిత్య బిర్లా ‘ఆద్యం’కు ముఖచిత్రంగా శోభితా..

ఆంధ్ర‌ప్ర‌భ : భారత చేనేత వారసత్వాలను సంరక్షించేందుకు కట్టుబడి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌ కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్‌వోవెన్, ప్రముఖ నటి, సాంస్కృతిక అభిరుచి గల కళాకారిణి శోభితా ధూళిపాళను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ‘కల్చర్ బియాండ్ టెక్స్‌టైల్స్’ అనే ఆద్యం అభివృద్ధి చెందుతున్న లక్ష్య దిశలో ఇది ఒక కీలక ముందడుగుగా నిలిచింది.

ఈ సందర్భంగా ఆద్యం హ్యాండ్‌వోవెన్ బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ… “ఆద్యం ఎప్పుడూ మగ్గాల వెనుక ఉన్న కళాకారులకు, మన చేతివృత్తులను నిలబెడుతున్న సంస్కృతులకు అండగా నిలుస్తోంది. శోభిత నేటి తరం మహిళ. చేనేతతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతం, సహజం. ఆమె మా ప్రచార ముఖచిత్రంగా చేరడం, భారతీయ పనితనంపై యువతలో మరింత అభిమానాన్ని కలిగించాలన్న మా లక్ష్యాన్ని బలపరుస్తుంది,” అన్నారు.

శోభితా ధూళిపాల కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… “కళలో ఎప్పుడూ భావోద్వేగం ఉంటుంది. ఏదైనా చేతితో తయారైతే, దాన్ని సృష్టించిన వ్యక్తి ఆత్మ అందులో కనిపిస్తుంది. నేత సంఘాలతో ఆద్యం చేస్తున్న పని, అన్ని రూపాల్లో సంస్కృతిని సెలబ్రేట్ చేసే వారి సిద్ధాంతం నన్ను ఎంతో ప్రత్యేకంగా కలిపాయి,” అని తెలిపారు.

ఆద్యం హ్యాండ్‌వోవెన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కార్పొరేట్ సామాజిక సంస్థగా, దేశవ్యాప్తంగా నేత సంఘాలతో కలిసి పనిచేస్తూ, భారతీయ చేతివృత్తులకు మద్దతుగా స్వయం సమృద్ధిగల పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Leave a Reply