One vote | ఉత్కంఠ మ‌ధ్య‌.. ఒక్క ఓటుతో

One vote | ఉత్కంఠ మ‌ధ్య‌.. ఒక్క ఓటుతో

ఒక్క‌ ఓటుతో గెలిచిన‌ సర్పంచ్ అభ్యర్థిని
11గంటల వరకు అధికారులకు కసరత్తు జరిగింది


One vote | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి (Indravelli) మండలంలోని ధనోర బి.సర్పంచ్ అభ్యర్థిని జాధవ్.జమున నాయక్ (Jadhav.Jamuna Nayak) ఒక్క ఓటు (One vote) తో గెలుపొందారు. ఆమె ప్రత్యర్థి అభ్యర్ధిని మెస్రం అనమీక పై హోరాహోరీగా సాగిన పోటీల్లో నువ్వా నేనా అంటూ..కేవలం ఒకే ఒక్క‌ ఓటు తేడాతో గెలుపొందడంతో ప్రత్యర్థి అభ్యర్థిని రీ కౌంటింగ్ (Re counting) కు ఆదేశించడంతో రాత్రి 11 గంటల వరకు రీకౌంటింగ్ కూడా నిర్వ‌హించారు.

మొత్తం పోలైన‌ ఓట్లు 863 కాగా… అందులో మేశ్రమ అనామిక కు 431ఓట్లు రాగా, జాదవ్ జమున నాయక్ కు 432 ఓట్లు రావడంతో అధికారులు గెలుపును ప్ర‌క‌టించారు. ఈ రీ కౌంటింగ్ (Re counting) తో గుండెల్లో రైళ్ళు పరుగేత్తినట్లయ్యింది. ఏది ఏమైనా కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలువడంతో ఆమె దేవుడా.. కరుణించావు.. గెలిపించావు.. అంటూ ఆనంద భాష్పాలు తెచ్చుకున్నారు. మండలంలో కేవలం ఒకే ఒక్క‌ ఓటుతో గెలిపించిన అభ్యర్థిగా రికార్డు కెక్కారు.

Leave a Reply