Meeting | గ్రామాల పురోగతే ప్రభుత్వ ధ్యేయం

Meeting | గ్రామాల పురోగతే ప్రభుత్వ ధ్యేయం
- ఎమ్మెల్యే కూన రవికుమార్
- బూర్జ మండల సాధారణ సర్వ సభ్య సమావేశం
Meeting | బూర్జ(ఆమదాలవలస), ఆంధ్రప్రభ : బూర్జ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని ప్రతి గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వెంటనే పరిశీలించి కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ప్రభుత్వం పథకాలు అందేలా చూడాలన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దారు, ఇంజనీర్లు, ఆరోగ్య శాఖ, సచివాలయ సిబ్బంది, పంచాయతీరాజ్ అధికారులు, మార్క్ ఫెడ్ స్టేట్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
