60 years | గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయం
60 years | నర్సంపేట, ఆంధ్రప్రభ : గిరిజన గ్రామాల అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో పోటీకి నిలిచిన భూక్య సురేష్ తెలిపారు. నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ పోటీబరిలో నిలిచారు. 60 ఏళ్ల(60 years) గిరిజన గ్రామాల అభివృద్ధి నెరవేర్చడం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయితీ పరిధిలోని ఓటర్లు తనను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించి ఇందిరమ్మ కలలు కన్నా గ్రామ సీమల అభివృద్ధి సాధించడం కోసం ముందుకు వస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhav Reddy) సహకారంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని, ముత్యాలమ్మ తండా అభివృద్ధి ఆకాంక్షిస్తూ పోటీ బరిలో నిలిచినట్లు సురేష్ తెలిపారు.
ముత్యాలమ్మ తండాలో 784 ఓటర్లు ఉండగా తను పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో నిలిచి ముత్యాలమ్మ తండా అభివృద్ధి చేస్తానని అన్నివేళలా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహకారం ఎమ్మెల్యే మాధవరెడ్డి చేయూత నివ్వడంతో అనతి కాలంలోనే గ్రామపంచాయతీ అభివృద్ధిని చేసి చూపిస్తానని సురేష్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరి చేయించి ఇండ్లు లేని వారికి కలలు సాకారం చేయడం, కొత్తవారికి రేషన్ కార్డుల మంజూరి, అంతర్గత రోడ్లు నిర్మాణం, సైడ్ కాల్వల నిర్మాణం చేయిస్తానని పేర్కొన్నారు.

