Ram Mandir | ఊపందుకున్న ప్రచారం

Ram Mandir | ఊపందుకున్న ప్రచారం

సర్పంచ్ అభ్యర్థి నైతం రామచందర్

Ram Mandir | తిర్యాణి, ఆంధ్రప్రభ : సర్పంచి అభ్యర్థిగా నైతం రామచందర్ ఇవాళ‌ రామ్ మందిర్ లో రామునికి కొబ్బరికాయ కొట్టి కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు గుర్తును చూయించుకుంటూ కత్తెర గుర్తుకే ఓటు వేయాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే.. రానున్న ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రతి ఇంట మినరల్ వాటర్ ఫ్రీగా పంపిణీ చేస్తానన్నారు.

నాకు వచ్చే ప్రతి నెలా సర్పంచ్ గౌరవ వేతనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తానన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో అంకం గౌరయ్య, బొల్లం రాకేష్ బోల మల్లేష్, బొల్లం రాజు, నల్లూరి రాజు, చందు, మహిళా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply