Petition | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్

Petition | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్

  • కీలక ఉత్తర్వులు జారీ

Petition | ఢిల్లీ, ఆంధ్రప్రభ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోషల్‌ మీడియా(social media)లో తనపై జరుగుతున్న వ్యక్తిగత హక్కులను దెబ్బతీసే ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో పవన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సాయి పిటిషన్‌ దాఖలు(Filing of Petition) చేసి వివరాలు కోర్టుకు తెలియజేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన దిల్లీ హైకోర్టు వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని పవన్ తరపున న్యాయవాది(lawyer)కి ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో పవన్ వ్యక్తిగత స్వేచ్ఛ(Personal freedom)కు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా, ఎక్స్ లను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు(Postponing) కోర్టు ప్రకటించింది. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన్ను దెబ్బతీసేందుకు కొందరు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Leave a Reply