Dead | కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

Dead | లాతూర్, ఆంద్రప్రభ : కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశ రాజకీయ రంగంలో అమోఘ సేవలు అందించిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్(Shivraj Patil) మరణం దేశాన్ని విషాదంలో ముంచింది. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని లాతూర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రజాప్రతినిధిగా, స్పీకర్‌గా, మంత్రిగా, గవర్నర్‌గా అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయన మరణంతో రాజకీయ వర్గాల్లో(political circles) శోకసంద్రం అలుముకుంది.
