Police Station | సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Police Station | సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Police Station | హైదరాబాద్, ఆంధ్ర్ర‌ప‌భ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో (Jublihills Police Station) సిట్‌ ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన సిట్‌ ఎదుట హాజరయ్యారు. వారం రోజుల పాటు ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణకు సుప్రీంకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. దాని తర్వాత వచ్చిన రిపోర్టుపై మళ్లీ విచారణ చేస్తామని పేర్కొంది. ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదంది. చట్టప్రకారం దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈక్రమంలో ప్రభాకర్‌రావు సిట్‌ ఎదుట హాజరయ్యారు.

Leave a Reply