ex gratia | తాటిచెట్టు పై నుండి పడి గీతకార్మికుని మృతి
ex gratia | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్ల బావికి చెందిన గీతకార్మికుడు గనగాని ఐలెను (54) ఈ రోజు సాయంత్రం గీతవృత్తిలో భాగంగా బిక్కేరు వాగు ఒడ్డున పుల్కరం బావి వద్ద తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో గ్రామంలో విషాదఛాయలు(Shades sadness) అలుముకున్నాయి.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఐలేనుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా(ex gratia) అందించి ఆదుకోవాలని గీత కార్మిక సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు.

