Ultrasound | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

Ultrasound | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

  • జిల్లా వైద్యాధికారి డా.కె.రవికుమార్

Ultrasound | అచ్చంపేట‌, ఆంధ్రప్రభ : జిల్లాలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వబోమని జిల్లా వైద్య అండ్ ఆరోగ్య శాఖ అధికారి డా.కె.రవికుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు అచ్చంపేట పట్టణంలో ఉన్న శ్వేత స్కానింగ్ సెంటర్(White Scanning Center), ఎం.ఎం.ఆర్ హాస్పిటల్, శ్రీ సాయి హాస్పిటల్, మైత్రి హాస్పిటల్, శ్రీ చరిత్ర సాయి హాస్పిటల్‌లలో ఆయన బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ప్రైవేట్ హాస్పిటళ్ల(Private Hospitals)లో స్కానింగ్ పరీక్షలకు వచ్చిన గర్భిణీ స్త్రీల వివరాలు, నిర్వహిస్తున్న రికార్డులు, అల్ట్రాసౌండ్ నివేదికలను సమగ్రంగా పరిశీలించారు.

లింగ నిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం హాస్పిటల్ వెలుపల, లోపల స్పష్టమైన బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలని, గర్భిణీ స్త్రీలకు చట్టం గురించి పూర్తి అవగాహన కల్పించాలని ఆసుపత్రి నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అల్ట్రాసౌండ్(Ultrasound) మిషన్లలో నమోదైన గత రికార్డులను కూడా క్రాస్ చెక్ చేసినట్లు డా.రవికుమార్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు సమాచారం తెలిసినా 8500879884 నంబర్‌కు ఫోన్ చేయాలని, వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి జి.రాజగోపాలాచారి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ(Deputy DMHO), కార్యాలయ డిపిఎంవో మధుమోహన్, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బికులాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply