Section 144 | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
- కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి
Section 144 | కమలాపూర్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు(Rallies), సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
144 సెక్షన్(Section 144) అమల్లో ఉన్నందున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించద్దని సూచించారు. దీన్ని అతిక్రమించి ఎవరైనా సరే ఆదేశాలు ధిక్కరిస్తే… చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టానికి లోబడి ఉండాలని సూచించారు.

