Gathering | దేవాలయాల అభివృద్ధి కోసం..

Gathering | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార సభ అవనిగడ్డలో జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… ప్రముఖ పుణ్యక్షేత్రాలు అవనిగడ్డ నియోజకవర్గంలో చాలా ఉన్నాయని తెలిపారు. అవనిగడ్డ రాజశేఖరస్వామి దేవస్థానం చైర్మనుగా ఘంటసాల కన్నయ్య, అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ దేవస్థానం చైర్మనుగా అన్నపరెడ్డి వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేయటం సంతోషించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
