Clash | పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Clash | పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఘటన స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
- ఇరువర్గాలకు సర్ది చెప్పిన సీఐ నాగబాబు
Clash | మణుగూరు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను తమ అభివృద్ధికి ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రచారం నిర్వహిస్తుండడంతో మీరు ఆ వైపు ప్రచారం చేయొద్దంటూ కాంగ్రెస్ నాయకులు వారించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మణుగూరు సీఐ నాగబాబు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటన స్థలానికి చేరుకొని కార్యకర్తలకు సర్ది చెప్పారు.
