Bigg Boss 9 | Sanjana : స్టాండ్ మార్చిన సంజ‌న‌.. కంగుతిన్న ఇమ్మ‌న్యుయేల్‌!

Bigg Boss 9 |వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బిగ్‌బాస్ -9 సీజ‌న్‌లో ట్విస్ట్ ఇవ్వ‌డంలో బిగ్‌బాస్‌కు మించి పోతున్నారు కుటుంబ స‌భ్యులు. 14వ వారంలో జ‌రుగుతున్న టాస్క్‌ల‌లో సంజ‌నా స్టాండ్ మార్చ‌డంతో ఇమ్మ‌న్యుయేల్ కంగుతిన్నాడు. ఒకింత ఎమోష‌న‌ల్(Emotional) అయిన సంజ‌నా నిన్న జ‌రిగిన టాస్క్ విష‌యంలో స్టాండ్ మార్చారు. దీంతో ఆట నుంచి ఇమ్మ‌న్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే వీక్ష‌కుల‌తో నేరుగా మాట్లాడే అవ‌కాశం కూడా భ‌ర‌ణి శంక‌ర్‌, త‌నూజ‌కు ల‌భించింది. త‌నూజ‌కు వారితో ముఖాముఖీ మాట్లాడే అవ‌కాశం క‌లగ‌డంతో మ‌రింత ఉత్స‌హంగా క‌నిపించింది.

త‌ల్లి, కుమారుడు బాండింగ్‌లో ఉన్న సంజ‌నా స్టాండ్ మార్చింది. తాను ఎప్పుడూ ఇమ్మ‌న్యుయేల్‌ను నామినేట్ చేయ‌న‌ని, అలాగే ఎలిమినేట్(eliminate) చేయ‌డానికి మ‌న‌స్క‌రించ‌ద‌ని ప‌దేప‌దే చెప్పింది. అయితే మొన్న జ‌రిగిన ఎలిమినేష‌న్‌లో సంజ‌నాను ఎలిమినేష‌న్ చేయ‌డంలో ఇమ్మ‌న్యుయేల్ కూడా పాత్ర ఉంద‌ని ఆమె బాధ‌ప‌డ్డారు. ప్రేక్ష‌కుల నుంచి త‌న‌కు భారీగా ఓటింగ్(Voting) ల‌భిస్తున్నా ప‌ది వారాలుగా ఇంటి స‌భ్యులు టాస్క్‌ల నుంచి ప్ర‌తిసారీ త‌న‌నే తొల‌గిస్తున్నార‌ని వెక్కివెక్కి ఏడ్చింది.

స్టాండ్ మార్చి భ‌ర‌ణి, త‌నూజ‌, సుమ‌న్‌శెట్టితో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్లంత నిర్ణ‌యించుకుని టాస్క్ నుంచి ఇద్దరిని ఎలిమినేష‌న్ చేయాల్సి వ‌చ్చిన ఓటింగ్‌లో ఇమ్మాన్యుయేల్‌, డీమాన్ ప‌వ‌న్‌కు ఓటు వేసి ఎలిమినేట్ అయ్యేలా చూసింది. దీంతో ఇమ్మ‌న్యుయేల్ కంగుతిన్నాడు.

బిగ్‌బాస్ – 9 సీజన్(Bigg Boss – Season 9) ముగియడానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఉండటంతో టాప్ 5 ఎవరు ఉంటారనే విషయంపై అభిమానుల్లో చర్చ జరుగుతున్నది. అలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇద్ద‌రు ఎవ‌రో అనేది కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. గత 13 వారాల్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము (మ‌ధ్య‌లో) 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్(9th Ramu Rathod) (స్వ‌చ్ఛందంగా ఎలిమినేట్‌), శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య నిఖిత, 13వ వారం రీతూ చౌదరీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక 14వ వారంలో నామినేషన్ ప్రక్రియను కొనసాగించకుండానే కంటెస్టెంట్ల(Contestants)ను డైరెక్టుగా బిగ్‌బాస్ నామినేట్ చేసిన సంగ‌తి విదిత‌మే. టికెట్ టు ఫినాలే గెలుచుకొన్న కల్యాణ్ పడాలను మినహాయించి మిగ‌తా ఆరుగురు కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దాంతో తనూజ , సంజన, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి నామినేషన్‌లోకి వచ్చారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు టాప్ 5 బెర్త్‌ను దక్కించుకొంటారనేది ఆసక్తికరంగా మారింది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వీక్ష‌కుల మ‌ద్ద‌తు ప్ర‌కారం తనూజ, సంజన, డీమాన్ పవన్ సేఫ్ జోన్‌లో ఉన్నార‌ని, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి అన్‌సేఫ్‌(Unsafe)లో ఉన్న‌ట్లు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. రేపు అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఓటింగ్ కొన‌సాగుతుంది కాబ‌ట్టి ఈ ప్లేస్‌లు కూడా తారుమార‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. శ‌నివారం, ఆదివారం రెండు రోజుల్లో ఇద్ద‌రిని ఎలిమినేట్ చేసే అవ‌కాశం ఉంది.

Leave a Reply