2types of | భవ, భావ దారిద్య్రం

2types of | భవ, భావ దారిద్య్రం
2types of | మనుషు లులో కొందరు ఇతరుల కష్టాలు, సమస్యలలో పాలు పంచుకొంటుంటారు.
మరికొంతమంది “ఎందుకు? పోనీలే!మనకు సమస్యలు, కష్టాలు ఉన్నాయి… అపుడు ఎవరొచ్చారు? అంటూ రివర్స్ ఆలోచనతో ఉంటారు. కొంతమంది పుట్టుక నుంచి లేమి తనం (దారిద్ర్యం)తో జీవిస్తూంటే, మరికొందరు పుట్టుకనుంచి ధనవంతులు గానే ఉంటారు. ఎవరు ఎలా పుట్టినా మనిషిలో మనసు పొందే ప్రేరణను బట్టే భవ దారిద్ర్యం, భావ దారిద్య్రం ఏర్పడతాయి.
భవ దారిద్ర్యం అంటే: భవ అంటే పుట్టుక. అంతేకాకుం డా సంసారం, భావోద్రేకం, వంటి అర్థాలు కూడా ఉన్నాయి. చాలా మంది “భవ సాగరం” అనే పదం వాడుతూ ఉంటారు. అంటే సంసారమనే సముద్రం లో ధర్మం, నీతి, పాపపుణ్యాలు అవేమీ లేకుండా ఉండడ మే మనం చేస్తున్న పని. కొంతమంది పుట్టుకనుంచి లేమి తనంతో ఉంటారు అని అనుకొన్నాము.
2types of | వారికి ఉన్న సంపద భగవంతుని దయ వల్లే

కుచేలుడు, భక్త శబరి వంటి వారు ఎందరో. కానీ, వారిలో భౌతిక దారిద్ర్యం ఉంటే, మానసిక దారిద్య్రం లేదు. వారు ఆనంద స్వరూపులు. అంతే కాకుండా పేదరికంలోనే ఆప్యాయత, అనురాగం, కలిసిమెలిసి ఉండటం, ఒకరికి అన్యాయం చేయకపోవడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో భగ వంతుని శరణాగతికై తపిస్తుంటారు. పోతనామాత్యుడు. భవ దారిద్య్రంతో ఉన్నా శ్రీరాముని సేవలో గడిపి, మహెూన్నతమైన భాగవతం అనే గ్రంథాన్ని అందించారు. భాగవతం చదివితే బాగు అవుతామని ప్రతీతి.
భావ దారిద్ర్యం : పుట్టుక నుంచి ధనవంతులుగా ఉన్నా, వారిలో అహంకారం చోటు చేసుకుని ఉంటుంది. వారిలో కరుణ ప్రేమ, దయ ధర్మం వంటివి వారికి దూరంగా ఉంటాయి. అంటే ఆర్థిక పుష్టి ఉన్నా, ఇతరులకు సహాయపడే మనస్తత్వం ఉండదు. వారికి ఉన్న సంపద భగవంతుని దయ వల్లే అని కూడా గుర్తించరు. ఆధ్యాత్మిక భావాలు ఉండవు. మంచితనం లోపం, వినయం ఉండదు. ధర్మం అంటే తెలియదు. ఇటువంటి లక్షణాలు ఉంటే….
