Telangana | పంచాయతీ ఎన్నికలు ప్రారంభం..

Telangana | పంచాయతీ ఎన్నికలు ప్రారంభం..
Telangana, ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు జరుగుతున్న తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3,834 సర్పంచి.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.
