Varanasi | మహేష్ ఎన్ని గెటప్పులో తెలుసా..?
Varanasi, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ భారీ సినిమా గ్లింప్స్ రిలీజ్(Glimpse release) చేసిన తర్వాత ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఎప్పుడెప్పుడు వారణాసి గురించి అప్ డేట్స్ వస్తాయా..? అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ మూవీలో మహేష్ గెటప్స్(Mahesh Getups) గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్..?

ఈ సినిమాలో మహేష్ బాబు రాముడుగా, రుద్రగా కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండు పాత్రలే కాకుండా 5 గెటప్పులో మహేష్ కనిపిస్తాడు అనేది లీకైంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి మిగిలిన మూడు పాత్రలు(Three roles) ఏంటి..? ఎలా ఉండబోతున్నాయి..? అనేది మరింతగా క్యూరియాసిటీని పెంచేసింది. మహేష్ కెరీర్లో ఇంత వరకు డ్యూయల్ రోల్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒకే సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు అంటే.. జక్కన్న ప్లానింగ్(Jakkanna Planning) మామూలుగా లేదు. ఫ్యాన్స్ కు అయితే.. నిజంగా పండగే అని చెప్పచ్చు. అందుకనే అనుకుంటా.. మహేష్ బాబు మీరు ఎంతైనా ఊహించుకోండి అంటూ సినిమా పై చాలా నమ్మకంగా మాట్లాడారు.
Varanasi | అభిమానులకు పూనకాలే
రాముడు గెటప్ కి సంబంధించి షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో రామాయణానికి సంబంధించిన ఎపిసోడే దాదాపు అరగంట ఉంటుందట. ఆ ముప్పై నిమిషాలు అభిమానులకు పూనకాలే(Poonakal for fans) అని చెప్పచ్చు. మిగిలిన గెటప్పుల్లో ఒక దానికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. అంటే.. మూడు గెటప్పులు షూట్ చేయాల్సివుంది. అయితే.. ఆ గెటప్పులు ఏంటి..? ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం జక్కన్న ఇప్పట్లో రివీల్ చేసే ఛాన్స్ లేదు. థియేటర్స్(Theaters) లో షాక్ ఇవ్వడం కోసం సీక్రెట్ గా దాస్తారు. మొత్తానికి జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదు.

