Honestly | మేం ఓట్లు కోనం….

Honestly | మేం ఓట్లు కోనం….
- నిజాయితీగా ఓటు వేయండి..
Honestly | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మేము ఎలాంటి ఓట్లు కొనం, పైసలు పంచం, మందు తాగిపించం, నిజాయితీగా ఆలోచించి ఓటు(vote) వేయండి అంటూ బిక్కనూర్ పట్టణ సర్పంచ్ అభ్యర్థి మైత్రి వేడుకున్నారు. ఈ సందర్భంగా తన ఇంటి ముందట బోర్డును ప్రదర్శించారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు.
తమపై నమ్మకంతో నిజాయితీ(honesty)గా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె కోరారు. ఈరోజు డబ్బులు పంచి మద్యం పంచితే రేపు ప్రజాసేవ చేయాలంటే మళ్లీ సమాజాన్ని దోచుకోవాల్సి వస్తుందని తెలిపారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేసేందుకు పోటీ చేయడం జరిగిందని ఆమె చెప్పారు. తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బోర్డు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
