Presiding | దూర ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రి ముందుగా పంపించాలి

Presiding | దూర ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రి ముందుగా పంపించాలి

Presiding | మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా ఎన్నికల సామాగ్రి పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసఫ్(Saint Joseph)(సి బి ఎస్ ఇ) పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్ సీ కేంద్రాన్ని ఆమె తనిఖి చేశారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేసే సమయంలో స్టాట్యూటరీ(Statutory), నాన్ స్టాట్యూటరీ పేపర్ల ప్రాధాన్యతను తెలియజేయాలని, అలాగే ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన జోనల్ అధికారి, రూట్ అధికారుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని తెలిపారు. ప్రిసైడింగ్(Presiding) అధికారులు పి ఓ డైరీ నిర్వహణ, టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో తీసుకొనే జాగ్రత్తలు మరోసారి తెలియజేయాలని చెప్పారు.

పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒకవేళ మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎం పి డి ఒ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పిసిఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి, ఇంచార్జ్ తహసిల్దార్ నేలపట్ల నరేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply