Review | అభివృద్ధి పనులు పూర్తి చేయండి

Review | అభివృద్ధి పనులు పూర్తి చేయండి

  • ఇరిగేషన్ పనుల్లో జాప్యం వద్దు
  • సిబ్బంది లోటు అంశం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Review | ఆంధ్రప్రభ, తిరువూరు : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు అధికారులను(Officers) సూచించారు. పట్టణంలోని వారి కార్యాలయంలో నియోజకవర్గ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ (భారీ, చిన్న తరహా) అధికారులతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Srinivasa Rao) ఈ రోజు ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశములో నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తులో చేయవలసిన పనుల గురించి అధికారులతో చర్చించారు.

అలాగే ప్రస్తుతం నియోజకవర్గంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారని, ఇంకా ఎంతమంది అవసరం ఉందని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరువూరు సబ్ డివిజన్‌(Subdivision)కు సంబంధించి 47మంది లస్కర్లకు గాను ముగ్గురు పనిచేస్తున్నారు. ఏఈ లు ఆరుగురికి గాను ఇద్దరు, విసన్నపేట సబ్ డివిజన్‌కు సంబంధించి 32 మంది లస్కర్లకు గాను 2, ఏఈ లు ముగ్గురికి గాను ఒక్కరు పని చేస్తున్నారని అధికారులు ఎమ్మెల్యే(mla) దృష్టికి తీసుకువచ్చారు.

అలాగే ఇలా ఖాళీగా ఉన్న స్థానాల‌లో ఉద్యోగులని త్వరగా నియమించేలా చూడాలని ఎమ్మెల్యేకి అధికారులు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇరిగేషన్ శాఖ(Irrigation Department)కు సంబంధించి పనులు ఆగకుండా అన్నిటినీ వెంటనే పూర్తి చేయాల‌ని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈలు రామదాసు, విజయలక్ష్మి ఏఈ లు సునీత, మహేష్, లోకేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply