Public service | ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
Public service | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా-బి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాతలే శాంతాబాయి పృథ్వీరాజ్ తమకు ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్బంగా మాట్లాడుతూ.. శాంతాబాయి మాట్లాడుతూ, “గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా ప్రజల సమస్యల కోసం కష్టపడుతున్నాను. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని, ప్రజాసేవ(public service)లో నా నిజాయితీని నిరూపించుకున్నాను.
నాకున్న పరిచయాలు, నాయకులతో ఉన్న అనుబంధం(affiliation) మేరకు గ్రామానికి కావలసిన అభివృద్ధి పథకాలను తెచ్చి, రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తాను” అని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే, గ్రామ పంచాయతీకి అనుకూలంగా నిరంతరం సేవలందిస్తానని శాంతాబాయి పేర్కొన్నారు.

