Collector Kumar Deepak | విధుల్లో ఆలసత్వం వద్దు

Collector Kumar Deepak | విధుల్లో ఆలసత్వం వద్దు
కలెక్టర్ కుమార్ దీపక్
Collector Kumar Deepak జన్నారం, ఆంధ్రప్రభ : ఓటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు ఆలసత్వం వహించకూడదని కలెక్టర్ (Collector) కుమార్ దీపక్ ఆదేశించారు. గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల మొదటి విడత ఎన్నికల దృష్ట్యా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి ఓటర్లకు (Voters) ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. విధుల్లో ఉన్న పీఓలు,ఓపీఓలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నిర్ణీత సమయానికి ఓటర్లు ఓటు వేసే లాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీవో హుమర్ షరీఫ్, ఎంఈఓ విజయకుమార్, వెటర్నరీ డాక్టర్లు రాజకుమార్, శ్రీకాంత్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
