Support | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు?

Support | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు?

  • స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం..
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి…

Support | నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి.. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తుందని మెదక్ మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఏం.దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ కు మద్దతుగా బుధవారం ప్రచారంలో పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని తెలంగాణ ప్రజలకు వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. రైతుకు ఎకరానికి 15వేలకు ఎగనామం ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారానికి తూట్లు పొడిచారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆగమైపాయే, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందే తప్ప, కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ఆరు గ్యారెంటీలను అమలు చేయక కాలయాపన(time pass) చేస్తుందని ఆరోపించారు.

Support

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలను అభివృద్ధి చెందాలనే చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆయన హయాంలోనే తాండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మంచి మనసున్న వ్యక్తి చదువుకున్న వాడు ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే యువకుడు, అతనికి మీ అమూల్యమైన(priceless) ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి శ్రీకాంత్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, గ్రామాలలో ప్రజలందరూ సారే కేసీఆరే కావాలంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపించాల‌ని ఓటర్ మహాశయులను కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగరాజు, సొసైటీ చైర్మన్ బాపు రెడ్డి, బాదే చంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టివిజయలక్ష్మి, మాజీ సర్పంచ్ తిరుమల గౌడ్, అబ్దుల్ అజీజ్, రాములు గౌడ్, రంజిత్ గౌడ్, మావురంరాజు, వెంకట్ రెడ్డి, నాయిని మహేష్, లక్ష్మణ్, పున్న వెంకటస్వామి, స్వామి గౌడ్, మావురం వినయ్, తాడెం మల్లేశం, సదాశివలింగం, ఫాజిల్, పంపరి శివ,శేఖర్, చంద్రయ్య,మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply