Dharmasagar | సర్పంచ్ బరిలో విశ్రాంత ఉద్యోగి …

Dharmasagar | సర్పంచ్ బరిలో విశ్రాంత ఉద్యోగి …
Dharmasagar | ధర్మసాగర్, ఆంధ్రప్రభ : 34 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగిగా అపార అనుభవం, విశ్రాంత ఉద్యోగిగా సామాజిక బాధ్యతతో గత పది సంవత్సరాలుగా కొట్టె వజ్రమ్మ మాణిక్యం గ్రామస్థులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో స్వతంత్ర అభ్యర్థిగా ధర్మసాగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో ఉన్నారు. ఆత్మీయ పలకరింపులతో గ్రామస్థులకు సుపరిచితురాలు. గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయడానికి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ప్రధాన ఎజెండా అని అవినీతిరహితంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు కేటాయించిన మనీ పర్స్ కు ఓటేసి గెలిపించాలని, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
